బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు ముకుల్ దేవ్(54) మరణించారు. ఆయన ఆకస్మిక మరణం బాలీవుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ముకుల్ దేవ్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. శుక్రవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఈ వార్త తెలిసిన వెంటనే స్నేహితులు శనివారం ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన సన్నిహితురాలు, నటి దీపశిఖా నాగ్‌పాల్ ఈ మరణవార్తకు సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అవుతూ.. తన…