Mukesh Ambani Family Security Case: పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ ఫ్యామిలీకి సెక్యూరిటీ కొనసాగింపుకు కేంద్రానికి అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టు. శుక్రవారం ఈ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. గతంలో త్రిపుర హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ముకేష్ అంబానీ ఫ్యామిలీకి భద్రత కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంబానీ కుటుంబ భద్రతకు సంబంధించి దాఖలైన కేసును కొట్టివేసింది.