శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నల రామారావు ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ థ్రిల్లర్ “ముగ్గురు మొనగాళ్లు”. శ్రీనివాస్ రెడ్డి చెవిటివాడి పాత్ర పోషిస్తుండగా, దీక్షిత్ మూగవాడిగా, రామారావు అంధుడిగా కనిపించనున్నారు. త్విషా శర్మ, శ్వేత వర్మ కథానాయికలుగా నటించారు. రాజా రవీంద్రను క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా కన్పిస్తున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చగా… అచుత్ రామరావు పి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.…