కోలీవుడ్ నల్ల పొన్ను ఐశ్వర్య రాజేష్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడి తొమ్మిది నెలలు దాటిపోయింది. సంక్రాంతికి వస్తున్నాంలో భాగ్యంగా ఓ వైపు గడుసు భార్యగా, మరో వైపు అమాయకత్వమైన ఇల్లాలిగా మంచి ఫెర్మామెన్స్ కనిపించింది. భార్య క్యారెక్టర్స్ చేయడానికి హీరోయిన్స్ నో చెప్పే ఇండస్ట్రీలో నలుగురు పిల్లల తల్లిగా నటించి రిస్క్ చేసింది. ఇంత కష్టపడినా తెలుగులో ఆఫర్లు నిల్. ఛాన్సులివ్వండని ఓపెన్ అవుతున్నా కూడా ఈ తెలుగమ్మాయిని పట్టించుకోవడం లేదు లోకల్ మేకర్స్.…