గతంలో ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. ఎంపీగా పనిచేసిన అనుభవం ముద్రగడ పద్మనాభానికి ఉంది. సమయానుకూలంగా పార్టీలు మారుతూ కొన్నిసార్లు సక్సెస్ అయ్యారు.. మరికొన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. 1994లో తొలిసారి ప్రత్తిపాడులో ఓడిన తర్వాత.. ఇక జీవితంలో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాబోనని భీష్మించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ సీట్ ఆఫర్ చేయడంతో పిఠాపురంలో పోటీ చేసినా.. ఆ సీటును ప్రజారాజ్యం పార్టీ గెల్చుకుంది. ఆపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగి.. కాపు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. తర్వాత…