చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మెరుపు స్టంపింగ్ చేసిన ఎంఎస్ ధోనీపై సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ప్రశంసలు కురిపించాడు. ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను చేసిన స్టంపింగ్ చూసి తన మైండ్ బ్లాక్ అయిందని తెలిపాడు. ఈ ఏడాది ధోనీ మరింత ఫిట్‌గా ఉన్నాడని, ఇంకా యవ్వనంగా కనిపిస్తున్నాడన్నాడు. మూడో స్థానంలో ఆడటం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ముంబైపై విజయం ఎంతో సంతోషంగా ఉందని రుతురాజ్ చెప్పుకొచ్చాడు.…