ఏపీలో సంచలనంగా మారిన ఎమ్మార్వో రమణయ్య మర్డర్ కేసులో నిందితుడిని 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. కస్టడీలో భాగంగా పోలీసులు రెండో రోజు పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో నిందితుడిని విచారిస్తున్నారు. ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడు గంగారాం కాల్ డేటా కీలకంగా మారింది.
ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు మమ్మరం చేశారు. చెన్నైలో నిందితుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.