బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు, అద్వితి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘మిస్టర్ బెగ్గర్’. వడ్ల జనార్థన్ దర్శకత్వంలో గురురాజ్, కార్తిక్ నిర్మిస్తోన్నఈ చిత్ర ప్రారంభోత్సవం సోమవారం రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు సత్యప్రకాష్ క్లాప్ ఇవ్వగా, కార్తీ మూవీ మేకర్స్ అధినేత, నిర్మాత రాజు కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు వి. సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సత్యప్రకాశ్ మాట్లాడుతూ…’ ‘ఈ చిత్రంలో భద్ర అనే…