Ozempic: డెన్మార్క్ ఔషధ తయారీదారు ‘‘నోవో నార్డిస్క్(Novo Nordisk)’’ భారతదేశంలో తన ప్రతిష్టాత్మక డయాబెటిస్ డ్రగ్ ‘‘ఒజెంపిక్’’(Ozempic)ను ప్రవేశపెట్టింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత్‌తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని అనుకుంటోంది. HbA1c 7 శాతం కన్నా ఎక్కువగా ఉన్న పెద్దలకు ఈ మందు అనుకూలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బులు, రిస్క్ ఎక్కువగా ఉన్న పెద్దలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఆకలిని తగ్గించే ప్రభావం వల్ల వెయిట్ లాస్ కోసం కూడా ఉపయోగపడనుంది.