ఎకో ఇండియా సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ చేసుకున్నట్లు వెల్లడించారు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు.. ఎకో ప్రాజెక్ట్ ద్వారా రోగులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఈ సంస్ధ పలు వైద్య కార్యక్రమాలపై వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తుందని తెలిపారు.. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని విజయవంతం చేయడానికి వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తామని, ప్రతీ 6 నెలలకి ఒకసారి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Tata Motors and Uber: ఉబర్ సంస్థ అతిత్వరలో హైదరాబాద్‌లో విద్యుత్ కార్లను ప్రవేశపెట్టనుంది. తద్వారా భాగ్య నగరంలో కాలుష్య నియంత్రణకు తనవంతు కృషి చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్స్ సరఫరా కోసం ఉబర్ కంపెనీ.. టాటా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టాటా మోటార్స్ 25 వేల ఎక్స్‌ప్రెస్-టీ మోడల్ వాహనాలను ఉబర్ సంస్థకు అందిస్తుంది. మన దేశంలోని గ్రీన్ మొబిలిటీ సెక్టార్‌లో ఇంత పెద్ద ఒప్పందం కుదరటం ఇదే తొలిసారి. ఉబర్ కంపెనీ…
ఫ్లిప్‌కార్ట్‌తో రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఎంవోయూ కుదుర్చుకుంది.. ఈ భాగస్వామ్యం ద్వారా, ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫారమ్‌లో 400 మిలియన్లకు పైగా వినియోగదారులకు పాన్-ఇండియా మార్కెట్ యాక్సెస్‌ను అందించడం ద్వారా స్థానిక వ్యవసాయ సంఘాలు మరియు తెలంగాణలోని స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
నాణ్యమైన విద్య దిశగా ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ మరో ముందడుగు వేసింది.. ప్రపంచంతో పోటీపడేలా పిల్లలను సన్నద్ధంచేసేందుకు రాష్ట్ర విద్యారంగంలో మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది.. అందులో భాగంగా అతిపెద్ద ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ ‘బైజూస్’తో ఒప్పందం చేసుకుంది ఏపీ సర్కార్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందంపై ఏపీ ప్రభుత్వం, బైజూస్ ప్రతినిధులు సంతకాలు చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయం వేదికగా విద్యాశాఖ సమీక్షలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం…
జునిపెర్ నెట్‌వర్క్స్ క్లౌడ్ & ఆటోమేషన్ అకాడమీ (జెఎన్‌సిఎఎ) మరియు స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, విఐటి-ఎపి విశ్వవిద్యాలయాల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఒయు) సంతకం కార్యక్రమం మే 25, 2021 మంగళవారం నాడు వర్చ్యువల్ విధానంలో జరిగింది. జెఎన్‌సిఎఎతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత విఐటి-ఎపి విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ డా|| ఎస్ వి కోటా రెడ్డి మాట్లాడుతూ ఈ సహకారం అధ్యాపకులకు మరియు విద్యార్థులకు జునిపెర్ ట్రైనింగ్ & సర్టిఫికేషన్ పొందడానికి సహాయపడుతుందని…