భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో మూడో మ్యాచ్ చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. భారత బ్యాట్స్ మెన్స్ ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేస్తున్నారు. రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్ లో కూడా సిక్సర్లు కొట్టడంలో మాస్టర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ పై టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును పంత్ క్రియేట్ చేశాడు. పంత్ తన టెస్ట్ కెరీర్‌లో 17వ అర్ధ సెంచరీ సాధించాడు.…