ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నివాసం వద్దే బాంబు కన్పించడం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే, మణిపుర్‌లోని కొయిరెంగేయ్ ప్రాంతంలో సీఎంకు ప్రైవేటు నివాసం ఉంది. ఈ ఇంటికి కొన్ని మీటర్ల దూరంలో ఈరోజు (డిసెంబర్ 17) తెల్లవారుజామున ఓ మోర్టార్ బాంబును స్థానికులు గుర్తించారు.