నిన్నటి రోజున నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకు నగరంలో పెద్ద ఎత్తున వరద సంభవించింది. ఈ వరద కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీ వరద వచ్చిచేరింది. ఈ వరద కారణంగా జంట జలాశయాలు నిండిపోవడంతో గేట్లు ఎత్తివేశారు. దీంతో మూసీలోకి వరద వచ్చి చేరింది. ఈ వరదల్లో మొసలి కొట్టుకొచ్చింది. దీంతో స్థానికులు భయాందోళనలు చెందారు. వెంటనే జూ అధికారులకు సమాచారం అందించారు.…