దేశం మొత్తానికి రుతుపవనాలు వీడ్కోలు పలకబోతున్నాయి. అక్టోబర్ 15 నాటికి రుతుపవనాలు పూర్తిగా కనుమరుగవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఐఎండీ ప్రకారం, ఈ సంవత్సరం దేశంలో సాధారణం కంటే 8 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని కూడా వాతావరణ శాఖ చెబుతోంది.