హైడ్రా – జీహెచ్ ఎంసీ పరస్పర సహకారంతో పని చేస్తే వర్షాకాలం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడగలమని హైడ్రా – జీహెచ్ ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్ , కర్ణన్ అభిప్రాయ పడ్డారు. సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం క్షేత్ర స్థాయిలో ఎదురౌతున్న సమస్యలు.. వాటి పరిష్కారంలో ఇబ్బందులపై ఇరువురు కమిషనర్లు గురువారం జీహెచ్ ఎంసీ కార్యాలయంలో చర్చించారు. ఇరు శాఖల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.…