Ajit Pawar comments on Modi's degree: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ డిగ్రీపై ప్రస్తుతం రాజకీయం నడుస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మోదీ డిగ్రీలను బహిర్గత పరచాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు జరిమానా కూడా విధించింది. చదువులేని ప్రధాని దేశానికి ప్రమాదం అంటూ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. మరోవైపు దేశంలోని ఇతర ప్రతిపక్ష నేతలు కూడా మోదీ డిగ్రీ చూపించాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు.