తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ షెడ్యూల్‌కు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు. లోకల్ 12 సీట్లకు షెడ్యూల్ ప్రకటన చేయగా.. ఆదిలాబాద్, వరంగల్, మెదక్ నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం లో ఉన్న ఒక్కొక్క సీటు,మహబూబ్ నగర్,రంగారెడ్డి జిల్లా రెండు స్థానాలకు ఎన్నిక జరుగనుంది. నవంబర్ 16న నోటిఫికేషన్, నవంబర్ 23 నామినేషన్ల…