(సెప్టెంబర్ 8న శ్రీలేఖ పుట్టినరోజు) ‘పిట్ట కొంచెం… కూత ఘనం…’ అనే మాటకు నిర్వచనం చెప్పిన ధీశాలి ఎమ్.ఎమ్.శ్రీలేఖ. పదేళ్ళు నిండాయో లేదో పదనిసలు పలికిస్తూ ఓ సినిమాకు సంగీతం సమకూర్చారు. అప్పట్లో అందరూ బాలమేధావిగా శ్రీలేఖను కీర్తించేవారు. అంత పసితనంలోనే సరిగమలతో సావాసం చేస్తూ బాణీలు కట్టిన శ్రీలేఖ అంటే అందరూ ముద్దు చేసేవారు. దాసరి నారాయణరావు ‘నాన్నగారు’తో శ్రీలేఖ తెలుగునాట తొలిసారి స్వరాలు పలికించారు. అంతకు ముందు విజయ్ హీరోగా నటించిన ‘నాలయై తీర్పు’…