Toll Fee: జాతీయ రహదారులపై టోల్ చెల్లింపులపై కేంద్రం సీరియస్‌గా వ్యవహరించనుంది. టోల్ బకాయిలు ఉన్న వాహనాలపై ఇకపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. టోల్ బకాయిలు ఉంటే వాహనాలకు కీలక సేవలను నిలిపివేయనుంది. బకాయిలు పెండింగ్‌లో ఉన్న వాహనాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC), ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రిన్యువల్, నేషనల్ పర్మిట్ వంటి సేవల్ని అడ్డుకోనుంది.