ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే కొందరు, ఆ తర్వాత మరి కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామాలు చేశారు. కానీ.... ఇంతవరకు ఒక్క రాజీనామా కూడా మండలి ఛైర్మన్ ఆమోదం పొందలేదు. ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి బైబై చెప్పేశారు.