పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వంశీతో నాకు 2009 నుంచే పరిచయం ఉంది.. ప్రజా రాజ్యం యువజన విభాగం యువరాజ్యం అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచి వంశీతో నాకు పరిచయం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీగా ఉండి కూడా వంశీ జనసేనలోకి వచ్చిన ఆయనని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను.. వంశీ తన సొంతింటికి వచ్చారు.