కైకలూరుకు చెందిన నాయకుడు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ వ్యవహారాన్ని అనుమానాస్పదంగా చూస్తున్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయ వర్గాలు. ఆయన మనసులో ఏముంది? అడుగులు ఎటువైపు పడుతున్నాయని గుసగుసలాడుకుంటున్నారు. ఉన్నట్టుండి సైలెంట్ అవడం వెనక ప్రత్యేక కారణాలు ఉన్నాయా అంటూ ఆరాలు తీస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్న వెంకటరమణ వైసీపీలో చేరాక ఆ పార్టీ ఎమెల్సీ పదవి ఇచ్చింది.