కృష్ణా జిల్లా: గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మీడియా సమావేశం నిర్వహిచారు. తన గెలుపుకు కృషిచేసిన గన్నవరం నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. గన్నవరం టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ గెలుపు కోసం కష్టపడి నియోజకవర్గంలో పనిచేశానని.. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాదని ముందుగానే తాను చెప్పానన్నారు. జగన్మోహన్ రెడ్డికి తాను చేసిన సవాల్ను నిజం…