గన్నవరం వైసీపీలో వేడి తగ్గటం లేదు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, నియోజకవర్గ మాజీ ఇంఛార్జ్ దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య సెగలు ఓ రేంజ్‌లో రాజుకున్నాయి. టీడీపీ టికెట్ పై గెలిచి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు వంశీ. గత ఎన్నికల వరకు పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా వ్యవహరించిన దుట్టా వర్గానికి వంశీ రాక ఇబ్బందిగా మారింది. 2014లో వంశీపై పోటీ చేసి దుట్టా 9 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కలేదు.…