వాళ్లంతా అధికారపార్టీని కాదని వెళ్లిపోయారు. ఇప్పుడు తిరిగొచ్చేస్తారని ప్రచారం ఊపందుకుంది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఎమ్మెల్యేకు టెన్షన్ పట్టుకుందట. పైకి ధీమాగా కనిపిస్తున్నా.. వారొస్తే తన పరిస్థితి ఏంటనే లెక్కల్లో ఉన్నారట ఎమ్మెల్యే. అది ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఎమ్మెల్యే సురేందర్‌లో గుబులు?ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అదిగో తోక అంటే.. ఇదిగో పులి అన్నట్టుగా రకరకాల ప్రచారాలు షికారు చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్‌ను వీడి వెళ్లిన పలువురు…