ఎక్కడైనా ముఖ్యమంత్రిపై మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశంసలు కురిపించడం సర్వసాధారణం.. సీఎంను ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కడబడితే అక్కడ మన నేతలు మాట్లాడడం చూస్తుంటాం.. ఇక, అసెంబ్లీలో సీఎం ఎదుటే.. పొగడ్తలు ఎన్నోసార్లు లైవ్‌లో చూసిఉంటారు.. కానీ, తమిళనాడు సీఎం స్టైలే వేరు.. శాసనసభలో మైకు దొరికిందే తడవుగా తనను పొగడ్తలతో ముంచెత్తుతున్న ఎమ్మెల్యేలను సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. శనివారం ఓ ఎమ్మెల్యే తనను పొగుడుతూ ప్రసంగిస్తుండగా మధ్యలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.…