తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై ఆరు కొరడా దెబ్బలు కొట్టించుకుని.. మురుగన్‌కు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ.. రాష్ట్రంలో స్టాలిన్ సర్కార్ ను గద్దె దించేందుకు ఇవాళ్టి నుంచి 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేస్తానని శపథం చేశారు.