ఉత్తరప్రదేశ్ సహరాన్‌పూర్ లో హృదయ విధార ఘటన చోటు చేసుకుంది. మీరట్ కు చెందిన షబ్నం అనే మహిళపై తన మొదటి భర్త యాసిడ్ తో దాడిచేశాడు. దీంతో ఆమె అతడితో విడాకులు తీసుకుంది. అనంతరం మరో వివాహం చేసుకుంది. అక్కడ కూడా ఆమె జీవితం దయనీయంగా మారింది. రెండో భర్త ట్రిప్ పేరు చెప్పి కాలువ ఒడ్డున వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.…