CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వనపర్తి పర్యటనలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరుతారు. ఈ పర్యటనలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మొదటగా, ఉదయం 11.30 గంటలకు వనపర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఆలయ అభివృద్ధి పనులకు పునాది రాయి వేయడం ద్వారా.. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు. అనంతరం, మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక…