మంత్రి కావాలన్న ఆ సీనియర్ నేత కల కలేనా? ఇప్పట్లో ఆ యోగం లేనట్టేనా? రెండోసారి శాసనమండలిలో అడుగుపెట్టబోతున్న ఆయనకు పాత పదవే మళ్లీ కట్టబెడతారా? దానికి ఆ సీనియర్ ఒప్పుకొంటారా? గుత్తాకు ఇచ్చే కొత్త పదవిపై చర్చ..! తెలంగాణ శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్‌కు ఆ తర్వాత టీఆర్ఎస్‌కు వచ్చారు. గులాబీ కండువా కప్పుకొన్న సమయంలో గుత్తాను మంత్రివర్గంలోకి…