ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు బొమ్మరిల్లు సినిమా గుర్తుకు వస్తోందట. ఇప్పటికీ నా చేతులు మీ చేతుల్లోనే ఉన్నాయి డాడీ.. అన్న డైలాగ్‌ని తెగ గుర్తు చేసుకుంటూ సేమ్ సీన్ అని యువ ఎమ్మెల్యేలు ఫీలైపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక్కడ డాడీ కేరక్టర్‌లో మంత్రి అచ్చెన్నాయుడు ఉంటే... కొత్త ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు అదే డైలాగ్ చెబుతున్నారట.