గోల్నాకకు చెందిన భవాని అనే మహిళా, భర్తతో గొడవపడి సరూర్నగర్ మినీ ట్యాంక్ బండ్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. గత రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి.