CRPF: పాకిస్తాన్ మహిళను పెళ్లి చేసుకున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కానిస్టేబుల్ మునీర్ అహ్మద్‌ని ఉద్యోగం నుంచి తొలగించింది. 41వ బెటాలియన్‌కి చెందని మునీర్ పాక్ మహిళను పెళ్లి చేసుకున్న విషయాన్ని దాచిపెట్టడంతో పాటు ఆమె వీసా గడువు ముగిసినప్పటికీ ఆమెకు ఆశ్రయం కల్పించినందుకు సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్లు సీఆర్‌పీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. అతడి చర్యలు సర్వీస్ రూల్స్‌ని ఉల్లంఘించడంతో పాటు జాతీయ భద్రతకు హానికరమని సీఆర్‌పీఎఫ్ తెలిపింది.