Pakistan–Bangladesh Defence Talks: పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ వైమానిక దళానికి జేఎఫ్–17 థండర్ యుద్ధ విమానాలు సరఫరా చేసే అంశంపై రెండు దేశాల వైమానిక దళాధిపతులు చర్చలు జరిపినట్టు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. అయితే ఈ విమానాల కొనుగోలు అంశంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. చైనా చెంగ్డు ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్, పాకిస్థాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ కలిసి అభివృద్ధి చేసిన జేఎఫ్–17 థండర్…