Military chopper crashes in Arunachal Pradesh: ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ఘటన మరవక ముందే మరో హెలికాప్టర్ కుప్పకూలింది. అరుణాచల్ ప్రదేశ్ లో శుక్రవారం మిలిటరీ హెలికాప్టర్ కూలింది. ఎగువ సియాంగ్ జిల్లాలోని ఓ గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రెస్క్యూ సిబ్బందిని ఘటన జరిగిన ప్రదేశానికి పంపారు అధికారులు. ప్రయాణికుల సంఖ్య, వారి పరిస్థితి గురించి ఇంకా ఏ వివరాలు తెలియవని ఎగువ సియాంగ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ శాశ్వత్ సౌరభ్ తెలిపారు.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది మృతి చెందిన హెలికాప్టర్ ప్రమాద ఘటన అందరినీ కలచివేసింది.. అయితే, అమరులైనవారి పార్థీవ దేహాలను తరలించే మార్గంలో పూల వర్షం కురిపించారు ప్రజలు.. అంబులెన్స్‌లు రాగానే పూల వర్షం కురిపిస్తూ.. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు.. నీల్‌గిరి జిల్లాలోని మద్రాస్ రెజిమెంట్ సెంటర్ నుంచి వారి భౌతికకాయాలను సూలూర్ ఎయిర్‌బేస్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రజలు రోడ్లకిరువైపులా నిలబడి పూల వర్షం…