Yemen: యెమెన్ తీరంలో ఆదివారం 154 మంది వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 68 మంది ఆఫ్రికన్ వలసదారులు మరణించారు. మరో 74 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి వలసల సంస్థ ధ్రువీకరించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మందిని మాత్రమే రక్షించామని యెమెన్ ఆరోగ్య అధికారి అబ్దుల్ ఖాదిర్ బజమీల్ చెప్పారు.