Divyendhu Sharma : తెలుగులో అదరగొట్టిన మీర్జాపూర్ మున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్-ఇండియా ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ వేడుక విజయవాడలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతున్న ప్రముఖ నటుడు (మీర్జాపూర్ ఫేమ్) దివ్యేందు శర్మ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన తొలి తెలుగు సినిమా అనుభవాలను, చిత్ర యూనిట్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రేక్షకులతో పంచుకున్నారు. తన ప్రసంగం ప్రారంభంలో, భాష కొత్తదైనందున ఏవైనా తప్పులు ఉంటే క్షమించాలని విజయవాడ ప్రజలను కోరారు దివ్యేందు. ఆ తర్వాత తెలుగులో మాట్లాడి అభిమానులను ఖుషీ చేశారు,. తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ‘మీర్జాపూర్’ సిరీస్‌లోని ఒక డైలాగ్‌ను గుర్తుచేస్తూ.. “మీరంతా మా ఫ్యామిలీ” అనే హిందీ డైలాగ్‌ను తెలుగులోకి అనువదించి, “మీరే మా కుటుంబం”* అనడంతో స్టేడియం మొత్తం కేరింతలతో మారుమోగిపోయింది,.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటించడంపై దివ్యేందు శర్మ సంతోషం వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “రామ్ చరణ్ అద్భుతమైన వ్యక్తి. ఆయనతో కలిసి నటించడం అంత సులువు కాదు, కానీ ఆయన నన్ను సెట్స్‌లో ఎంతో కంఫర్టబుల్‌గా ఉంచారు. దానివల్ల నా పాత్రను నేను అనుకున్న రీతిలో, చాలా చక్కగా ప్రెజెంట్ చేయగలిగాను.” దర్శకుడు బుచ్చిబాబు సానాపై దివ్యేందు ప్రశంసలు కురిపించారు. ఆయనను ఒక “మ్యాడ్ జీనియస్” గా అభివర్ణిస్తూ.. తనపై నమ్మకం ఉంచి ఈ పాత్రను ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు,. తనకు తెలుగు సంస్కృతి, భాష, భావోద్వేగాలు కొత్తవైనప్పటికీ చిత్ర యూనిట్ ఎంతో మద్దతుగా నిలిచిందని చెప్పారు. అలాగే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సతీష్ గారికి మరియు విజయవాడ ప్రేక్షకుల అద్భుతమైన ఎనర్జీకి ఆయన థాంక్స్ చెప్పారు.
Also Read
తాజావార్తలు
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!