తాను అధికార బాధ్యతల నుంచి తప్పుకోను.. త్వరలోనే కొత్త ప్రధాన మంత్రిని నియమిస్తానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఎలిసీ ప్యాలెస్ నుంచి ఫ్రాన్స్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మీరు ఐదేళ్లు పాలించమని నాకు అధికారం ఇచ్చారు.. అన్ని వ్యవస్థలను సక్రమంగా నడిపిస్తాను.. ప్రజలను రక్షిస్తూ దేశాన్ని ముందుకు తీసకెళ్లే బాధ్యత నాపై ఉందని మెక్రాన్ చెప్పుకొచ్చారు.
ఫ్రాన్స్‌లో మితవాద, అతివాద చట్ట సభ్యలు ఒక్కటై అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ప్రధాని మిచెల్ బార్నియర్ తన పదవిని కోల్పోయారు. ఫ్రాన్స్ ప్రధానమంత్రి మిచెల్ బార్నియర్, ఆయన మంత్రివర్గంపై ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు బుధవారం అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. ఫ్రెంచ్ ప్రధాన మంత్రి మిచెల్ బార్నియర్ ప్రభుత్వం ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీలో విశ్వాస ఓటింగ్‌లో ఓడిపోయింది.