Shocking: దేశ ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా విలసిల్లుతున్న బెంగళూరులో నిత్యం లక్షలాది మంది ప్రజలు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి మెట్రో ఒక ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న తరుణంలో, ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన నగర ప్రజలను, ముఖ్యంగా మహిళలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అదే, “బెంగళూరు మెట్రో చిక్స్” అనే ఇన్ స్టాగ్రామ్ పేజీ వ్యవహారం. నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు మెట్రో బోగీల్లో మహిళలు, అమ్మాయిలు ప్రయాణిస్తున్నప్పుడు వారి ప్రమేయం లేకుండా,…