మన శరీరంలో అత్యంత ప్రభావవంతమైన అవయవం మెదడు. ఆలోచనలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలను విశ్లేషించేదీ... నిర్ణయాలను చేసేది అదే. ఒక్కమాటలో చెప్పాలంటే మన శరీరంలో మెదడే హెడ్‌మాస్టర్. మన పూర్వీకులు చూడని ఎన్నో సంక్లిష్టతలను ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటోంది. ఫోన్లో నిరంతరం వచ్చిపడే నోటిఫికేషన్లు, ఆలోచనలు, పని సంస్కృతి వంటివి కుదురుగా నిలవనీయడం లేదు. దీంతో మెదడుపై ఒత్తిడి పడుతోంది. కాలక్రమంలో మెదడు మొద్దుబారి పోతుంది. మీ మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఈ చిట్కాలు పాటించండి..