పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్రకు పవన్ కుటుంబ సభ్యుల ఆర్ధిక చేయూత అందిస్తున్నారు. కౌలు రైతుల భరోసా యాత్ర ప్రత్యేక నిధికి రూ.35 లక్షలు విరాళం అందించి తమ ఉదారత చాటుకున్నారు. పవన్ కళ్యాణ్‌ని కలిసి చెక్కులు అందించారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మేము ఇంట్లో ఎప్పుడు కూడా రాజకీయాలు గురించి మాట్లాడుకోం. కుటుంబ సభ్యులుగా రాజకీయాల్లో నేను ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరుకుంటారు…