తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుందని తెలుస్తోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసన సభా సమావేశాల్లో పాల్గొన్న అనంతరం జరిగే బీఏసీ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఆదివారం రోజు నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనేందుకు సీఎం ఢిల్లీకి పయనమవుతున్నారు. ఈ నెల 26న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు…