బ్యాంకులు రుణాలు ఎగ్గొట్టిన కేసులో హైదరాబాద్‌కు చెందిన మీనా జువెల్లర్స్‌పై సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది. కంపెనీతో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ అయిన ఉమేష్ జేత్వానిపై కూడా కేసు నమోదు చేశారు. ఎస్‌బీఐ ఆధ్వర్యలోని కన్సార్టియం నుంచి రూ. 364.2 కోట్ల రుణం తీసుకుని మోసం చేశారని సీబీఐ అభియోగాలు మోపింది. 2015 నుంచి 2019 మధ్య కాలంలో ఈ కంపెనీ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుంది. మీనా జువెల్లర్స్ డైమండ్ ప్రైవేట్…