Beangal Rape case: బెంగాల్ మెడికల్ విద్యార్థిని అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమెతన బాయ్‌ఫ్రెండ్‌తో బయటకు వెళ్లిన సమయంలో, ఆమెపై అఘాయిత్యం జరిగింది. ఈకేసులో బాధితురాలి బాయ్‌ఫ్రెండ్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులు చెబుతున్నదాని ప్రకారం.. బాధితురాలు తన వాగ్మూలంలో తాను తన బాయ్‌ఫ్రెండ్‌తో బయటకు వెళ్లినప్పుడు నిందితుడు అత్యాచారం చేసినట్లు పేర్కొంది. ఆమె తండ్రి తన ఫిర్యాదులో అతడి పేరును కూడా పేర్కొన్నాడు. ఈ కేసులో ఇది ఆరో అరెస్ట్.
Bengal gang-rape Case: పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. కోల్‌కతా ఆర్జీకల్ మెడికల్ కాలేజ్ ఘటన మరవక ముందే ఈ సంఘటన చోటు చేసుకుంది. క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన, విద్యార్థిని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.