GST-TV prices: మోడీ సర్కార్ సామాన్య ప్రజలకు జీఎస్టీ సవరణలతో శుభవార్త చెప్పారు. ఈ పెస్టివల్ సీజన్‌కు ముందే సగటు ప్రజలకు అవసరయ్యే అన్ని వస్తువులపై జీఎస్టీని తగ్గించారు. ముఖ్యంగా, ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు, నిత్యావరసరాలు మరింత సరసమైన ధరలకు వినియోగదారుడికి అందుబాటులోకి రాబోతున్నాయి. ముఖ్యంగా, పండగలకు ముందు ప్రీమియం టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు కొనుగోలు చేయాలనే వారికి పండగే అని చెప్పవచ్చు.