మెదక్ జిల్లా కేంద్రంలో మరోసారి కుండపోత వర్షం కురిసింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఏకంగా 7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
మెదక్ జిల్లా తూప్రాన్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షానికి గాయత్రి నగర్ కాలనీ, ఏబీ కాలనీతో పాటు పలు కాలనీలు జలదిగ్బంధానికి గురయ్యాయి. భారీ వరదతో ఇళ్లు నీటమునిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.