ఢిల్లీలో అర్ధరాత్రి బుల్డోజర్ చర్యలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఫైజ్-ఎ-ఇలాహి మసీదు సమీపంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో స్థానికులు తిరగబడ్డారు. పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తుర్క్‌మాన్ గేట్ వద్ద ఉన్న ఫైజ్-ఎ-ఇలాహి మసీదు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడానికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) బుధవారం ఉదయం బుల్డోజర్ ఆపరేషన్ నిర్వహించింది. ఆక్రమణను తొలగించడానికి ఆ స్థలంలో పదిహేడు బుల్డోజర్లను మోహరించారు. దీనికి వ్యతిరేకంగా స్థానికులు…