Maoist Ceasefire: ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు దేశంలో మావోయిస్టులను లేకుండా చేసేందుకు వరసగా దాడులు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో భద్రతా బలగాలు పలు ఎన్‌కౌంటర్లలో కీలకమైన మావోయిస్టు లీడర్లను హతమార్చారు. ఇది సెక్యూరిటీ ఫోర్సెస్‌కి కీలక విజయమని చెప్పవచ్చు. ఈ ఆపరేషన్ల నేపథ్యంలో మావోయిస్టులు ‘‘కాల్పుల విరమణ’’ను ప్రకటించారు. ఆయుధాలను వదిలేస్తామని కేంద్రానికి లేఖ రాయడం సంచలనంగా మారింది.
వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది.. అంతేకాదు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తే కాల్పుల విరమణ కూడా చేస్తామని కేంద్ర కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.. ఇందుకు సంబంధించి కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది.. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు..