Manipur: మణిపూర్లో చెలరేగిన హింస కొనసాగుతూనే ఉంది. సాయుధ ముష్కరులు శుక్రవారం మరోసారి కాల్పులు జరిపారు. ఇప్పటి వరకు ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. సైన్యం ప్రతీకారం తీర్చుకుంటోంది.
Manipur Violence: మే 3న మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండ ఇంకా చల్లారలేదు. దాదాపు 80 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు ఈ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి. దీంతో పాటు మృతుల కుటుంబంలోని ఒక్కరికీ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.
మణిపూర్లో అల్లర్లు రేగిన అనేక ప్రాంతాల్లో పోలీసు కమాండోలు ఎనిమిది గంటలకు పైగా ఆపరేషన్ నిర్వహించి సుమారు 40 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు తమకు నివేదికలు అందాయని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఈరోజు మీడియాతో తెలిపారు.