కర్ణాటకలోని మంగుళూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మొబైల్ దొంగతనం చేశాడనే ఆరోపణలతో ఏపీకి చెందిన ఓ మత్స్యకారుడి పట్ల సహచర మత్స్యకారులు దారుణంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళ్తే… ఏపీకి చెందిన వైల శీను మంగళూరులో మత్స్యకారుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ కనిపించలేదు. దీంతో వైల శీనునే ఆ మొబైల్ దొంగిలించాడని మిగతా మత్స్యకారులు భావించారు. ఈ నేపథ్యంలో ఫోన్ ఎక్కడ పెట్టావంటూ పదే పదే ప్రశ్నిస్తూ.. కనీసం వైల శీను చెప్పేది వినకుండా…